“Personality Development | లక్షల జీతం పొందే ఉద్యోగం కావాలా? అయితే దీన్ని వెంటనే మార్చుకోండి
Personality Development | ఉపాధి చూపించడంలో హైదరాబాద్ టాప్. విభిన్న రకాల కొలువులకు అడ్డా. అందుకే చాలా మంది నగరానికి వచ్చి స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తారు. చదువు పూర్తవడమే ఆలస్యం హైదరాబాద్‌కు వచ్చి సంబంధిత రంగాల్లో ఉద్యోగ వేటలో పడుతుంటారు. హోటల్ రంగం నుంచి ఐటీ వరకు మంచి ప్యాకేజీలతో అర్హతకు తగ్గ జాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలు సాధించడమే అసలైన టాస్క్‌గా నిపుణులు చెబుతున్నారు
“Personality Development | “ఆమె పేరు పూజ. ఎంటెక్ పూర్తి చేసింది. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరైంది. అందులో ఆమె సెలెక్ట్ అవ్వలేదు. కారణం ఆమె బాడీ లాంగ్వేజీ. ఇంటర్వ్యూ మధ్యలో ఎటో చూస్తూ మాట్లాడటం, చివర్లో చటుక్కున వెళ్లిపోవడం, వినిపించకుండా తనలో తానే మాట్లాడుకోవడం ఇలాంటి కారాణాలతో ఆమె ఆ కొలువుకు దూరం కావల్సి వచ్చింది.” అని ఓ కంపెనీ రిక్రూట్మెంట్ విభాగం ప్రతినిధి తెలిపారు.
అతడి పేరు కల్యాణ్. డిగ్రీ ఉత్తీర్ణుడు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. తనకు తెలిసిన స్నేహితుడి సాయంతో అమీర్‌పేట్‌లోని ఓ కాల్ సెంటర్‌కు ఇంటర్వ్యూకి వెళ్లాడు. అది అతడికి ఆరో ఇంటర్వ్యూ. అది కూడా ఫెయిల్ అయింది. అన్ని ప్రశ్నలకు సమాధానం కరెక్ట్‌గానే చెబుతున్నా కానీ ఉద్యోగానికి ఎంపిక అవడం లేదని బాధపడుతుంటేవాడు. ఈ విషయాన్ని అక్కడే ఉద్యోగం చేస్తున్న వారికి చెప్పగా వారు ఇంటర్వ్యూలో పాటించాల్సిన విధానాన్ని చెప్పారు. అదే బాడీ లాంగ్వేజీపై చర్చించారు. విషయం తెలుసుకున్న కల్యాణ్ ఆ మరుసటి రోజు ఓ బ్యాంక్‌కు సంబంధించిన లోన్స్ విభాగానికి ఇంటర్వ్యూకి వెళ్లి సక్సెస్ అయ్యాడు.

సిటీబ్యూరో, మే 19(నమస్తే తెలంగాణ): ఉపాధి చూపించడంలో హైదరాబాద్ టాప్. విభిన్న రకాల కొలువులకు అడ్డా. అందుకే చాలా మంది నగరానికి వచ్చి స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తారు. చదువు పూర్తవడమే ఆలస్యం హైదరాబాద్‌కు వచ్చి సంబంధిత రంగాల్లో ఉద్యోగ వేటలో పడుతుంటారు. హోటల్ రంగం నుంచి ఐటీ వరకు మంచి ప్యాకేజీలతో అర్హతకు తగ్గ జాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలు సాధించడమే అసలైన టాస్క్‌గా నిపుణులు చెబుతున్నారు. కొన్ని సంస్థలు ఉద్యోగాలు పొందేలా సంబంధిత నైపుణ్యం అందించడానికి శిక్షణా సంస్థలు కూడా నెలకొల్పాయి. మరికొందరూ డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు అందిస్తున్నాయి. ఏ కొలువు అయినప్పటికీ ఇంటర్వ్యూను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే ఉద్యోగం దక్కుతుంది. సంబంధిత రంగాన్ని బట్టి ఇంటర్వ్యూల లెవల్స్ ఆధారపడి ఉంటాయి. సబ్జెక్ట్ ఏదైనా.. ఇంటర్వ్యూలో కొన్ని మెలకువలు పాటిస్తే కచ్చితంగా ఉద్యోగం సంపాదించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ సూచనలు పాటిద్దాం..
- బాడీ లాంగ్వేజి చాలా కీలకం. సాఫ్ట్‌స్కిల్స్‌లో ఇది చాలా ముఖ్యమైనది. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఎలాంటి శరీర కదలికలు మనలో ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తాయో తెలిస్తే అవకాశాలు మరింత మెరుగవుతాయి. అలాగే ఎలాంటి కదలికలు మనమీద వ్యతిరేక భావాలు కలిగిస్తాయో తెలిస్తే జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- కార్పొరేట్ కొలువుల్లో ప్రస్తుతం అంతఃసౌందర్యం కంటే బాహ్య సౌందర్యం కూడా కీలకపాత్ర పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.
- సబ్జెక్టు నాలెడ్జ్, నైపుణ్యంతో పాటు మాటల్లో సౌమ్యం ఉంటే ఉద్యోగం సాధించడంలో మందున్నట్టే.
- మన శరీర కదలికల ద్వారా మన గురించి వ్యక్తమవుతుంది. కావున మనసును అన్ని సమయాల్లో ప్రశాంతంగా ఉంచుకోవాలి.
- ఇంటర్యూ సమయంలో సీటులో వెనక్కి వాలి కూర్చోవద్దు. ఇది మొరటుతనాన్ని సూచిస్తుందని గుర్తుంచుకోవాలి.
- మాట్లాడేటప్పుడు పదే పదే ముఖాన్ని తడుముకోవడం, జట్టు, ఆభరణాలు సవరించుకోవడం లాంటివి చేయవద్దు.
- బాడీ లాంగ్వేజీపై పుస్తకాలు, వెబ్సైట్లు చూస్తూ అవగాహన పెంచుకోవచ్చు.
- ఇంటర్వ్యూలకు వెళ్లే ముందర విజేతల శరీర హావభావాలు గమనించండి. ప్రస్తుతం యూట్యూబ్‌లో అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
- ఎదుటి వారితో సూటిగా కళ్లల్లోకి చూస్తూ మాట్లాడండి. నేల చూపులు, దిక్కులూ చూస్తే ఆత్మవిశ్వాసం లేదనే భావన కలుగుతుంది.
- మీ భూజాలను నిటారుగా ఫ్రీగా ఉంచండి. కిందికి వంచేసి కూర్చొంటే నిరాసక్తతతో ఉన్నట్టు అంచనా వేస్తారు.
- ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని కూర్చొంటే క్రమశిక్షణ లేని వ్యక్తులుగా అనుకుంటారు.
- మొహం తిప్పుకుని ఎటో చూస్తూ మాట్లాడటం సందేహాన్ని దారి తీస్తుంది.
మొదటగా ఉద్యోగాన్ని ఇష్టపడాలి
ప్రతి చిన్నదానికి భయం వద్దు. ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఆందోళన అస్సలే వద్దు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. ప్రతిరోజు కనీసం అరగంట పాటూ ధ్యానం చేయాలి. అన్నింటి కంటే ముఖ్యంగా మనం ఏ ఉద్యోగానికి వెళ్తున్నామో దానిని ఇష్టపడాలి. మీ ముఖంపై ఆనందం మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. చిరునవ్వు ఒత్తిడిని మటుమాయం చేసే గొప్ప ఔషధం. సబ్జెక్టు, నైపుణ్యంతో పాటు బాడీ లాంగ్వేజీ కూడా కీలకమని గుర్తుంచుకోవాలి.
-నందిత, సైకాలజిస్టు
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి
సంతోషం, ఆందోళన మనసును బట్టి, ఆలోచన దృక్ఫథాన్ని బట్టి ఉంటుంది. మదిలోని భావాలు ముఖంలో స్పష్టంగా తెలిసిపోతాయి. ఆనందంగా ఉన్నప్పుడు మెదడులో సెంటోనినన్, ఆందోళనలో ఉంటే కార్జిజాల్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా ముఖ కవలికల్ని మార్చేస్తాయి. ఇంటర్వ్యూ చేసే వారు ముఖంలోని హావభావాలను పరిశీలిస్తుంటారు. చదువుతో నిమిత్తం లేకుండా మానసిక స్థితిని అంచనావేసి అన్ని సరిపోతేనే కొలువులిస్తారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాడీ లాంగ్వేజీని మెరుగుపరుచుకోవాలి.
– శివ, వ్యక్తిత్వ వికాస నిపుణులు
Read More :
Personality Development | 90 రోజుల్లో మీ భవిష్యత్తు ప్లానింగ్స్ ఇలా మార్చుకోండి”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

