Personality Development | 90 రోజుల్లో మీ భవిష్యత్తు ప్లానింగ్స్ ఇలా మార్చుకోండి
Personality Development | కొత్త కాలేజీ, కొత్త ఉద్యోగం, కొత్త కాపురం, కొత్త వ్యాపారం.. ఏదైనా సరే, తొలి తొంభై రోజులూ చాలా కీలకమని చెబుతారు మానసిక నిపుణులు. ఆ మూడు నెలల కాలమూ ఒక ఎత్తు, మిగతా సమయమంతా మరొక ఎత్తని అంటారు. కాబట్టి, ‘ప్లాన్@90 డేస్ ( Plan @90days )' సిద్ధం చేసుకోండి.
Personality Development | కొత్త కాలేజీ, కొత్త ఉద్యోగం, కొత్త కాపురం, కొత్త వ్యాపారం.. ఏదైనా సరే, తొలి తొంభై రోజులూ చాలా కీలకమని చెబుతారు మానసిక నిపుణులు. ఆ మూడు నెలల కాలమూ ఒక ఎత్తు, మిగతా సమయమంతా మరొక ఎత్తని అంటారు. కాబట్టి, ‘ప్లాన్@90 డేస్ ( Plan @90days )’ సిద్ధం చేసుకోండి.
జీవితం అంటే మార్పుల సముదాయం. విద్యార్థిగా ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి, ఉద్యోగిగా ఒక హోదా నుంచి ఇంకో హోదాకు, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, కుటుంబంలో సభ్యుడి బాధ్యత నుంచి ఇంటి పెద్ద బాధ్యతకు, బ్రహ్మచారి నుంచి గృహస్థు జీవితానికి.. ఇలా అనేకానేక మార్పులు. ఆ మార్పుతోపాటు మన ఆలోచనా విధానం, వ్యూహాలు, ప్రణాళికలు కూడా మారిపోవాలి. కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఆ పరిణామ ప్రక్రియ మొత్తం తొలి తొంభై రోజుల్లో పూర్తయిపోతే భవిష్యత్తులో తిరుగు ఉండదని సూచిస్తారు వికాస గురువులు.

కొత్తకొత్తగా..
కొత్త ఉద్యోగంలో చేరడం అంటే.. ఓ కొత్త ప్రపంచంలో అడుగుపెట్టడమే. పరిచయం లేని వాతావరణం. ప్రత్యేక పని సంస్కృతి. అవన్నీ కొత్తే. వివాహ బంధంలోనూ ఇలాంటి సవాలే ఎదురవుతుంది. మనం పుట్టి పెరిగిన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం మన ఆలోచనా విధానాన్ని, జీవనశైలిని ప్రభావితం చేసి ఉంటాయి. మరో కుటుంబం.. ఇంకో రకమైన సమాజం నుంచి వచ్చిన వ్యక్తితో కలిసి జీవించడం అంత సులభమైన విషయం కాదు. కొత్త ఆఫీసు అయినా, కొత్త కాపురం అయినా తొలిదశలో అనేక వైరుధ్యాలను అధిగమించాల్సి ఉంటుంది. కొన్ని పట్టువిడుపులు తప్పవు. ఆ సర్దుబాటుకు తొంభై రోజుల ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళికా రచనకు ముందు.. మనల్ని మనం బేరీజు వేసుకోవాలి. ఎదుటి వ్యక్తిని లేదా సంస్థనూ అంచనా వేయాలి. మనలో ఉన్న లక్షణాలేమిటి, ఎదుటివాళ్లేం కోరుకుంటున్నారు.. అనే స్పష్టత ఉండాలి. సరికొత్త ఆలోచనా విధానానికి అలవాటు పడాలి. ఆ మేరకు మనల్ని మనం మార్చుకోవాలి. ఏ యజమానీ వెనువెంటనే అద్భుత ఫలితాలు ఆశించడు. ఏ భార్యా తన భర్తలో తక్షణ మార్పు ఊహించదు. ఆ ఎదురుచూపు వ్యవధి సగటున తొంభై రోజుల వరకూ ఉంటుందని సైకాలజిస్టుల అంచనా. ఇక్కడే చాలామంది విఫలం అవుతుంటారు. దీనికి రెండు కారణాలు.. ఒకటి, పరిస్థితులకు తగినట్టు మారకపోవడం, నైపుణ్యాలను మార్చుకోకపోవడం. పాత సూత్రాలనే పట్టుకుని వేలాడటం. రెండు, ఎదుటి వ్యక్తి మన నుంచి ఏం ఆశిస్తున్నారనే విషయంలో స్పష్టత లేకపోవడం. ఈ రెండూ ప్రమాదఘంటికలే.

మూడు నెలల ప్రణాళికలో..
ఒక పని అలవాటుగా మారడానికి ఇరవై ఒక్క రోజులు సరిపోతాయి. కానీ, ఆ మార్పు తాత్కాలికమే. మరింత బలపడాలంటే, జీవనశైలితో ముడిపడాలంటే మూడునెలల వ్యవధి అవసరం. ఆ తొంభై రోజుల ప్రణాళికలో కొన్ని కీలక అంశాలు..
☏ మీ పట్ల మీరు నమ్మకాన్ని పెంచుకోండి.
☏ మాట మీద నిలబడండి.
☏ ఓ విద్యార్థిలా కొత్త విషయాలు నేర్చుకోండి.
☏ తక్కువ మాట్లాడండి. ఎక్కువ వినండి.
☏ మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వండి.
☏ మీ బలహీనతలు తెలుసుకోండి.
☏ ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోండి.
మూడు నెలలు పూర్తయ్యే నాటికి.. వ్యక్తిగా మీలో, వ్యవస్థగా మీ సంస్థలో ఎంతోకొంత మార్పు కనిపించాలి. ఎన్నో కొన్ని విజయాలు సాధించాలి. ఎదుటి మనిషిలో రవ్వంతైనా ఆశావాదం సృష్టించగలగాలి. ఆ మాత్రం నమ్మకం చాలు. మంచి బాస్‌గా, మంచి ఉద్యోగిగా, మంచి జీవిత భాగస్వామిగా.. మీరు స్థిరపడటానికి, బలపడటానికి.
Read More :
“అమ్మో రిస్క్ అని అనుకుంటే సక్సెస్ అందుకోవడం అసాధ్యం”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

