‘హీరామండీ’తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న భన్సాలీ సంజయ్ ‘లీల’ తరాలకు అతీతంగా అందరి మన్ననలూ అందుకుంటున్నది. ఇందులో అదితీరావ్ హైదరీ ధరించిన పాత్రకు, అందులో ఆమె చూపిన అభినయానికి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి.
ఈ క్లాసిక్ వెబ్సిరీస్లోని ‘సయ్యా హటో జావో..’ పాటలో అదితి చూపించిన హావభావాలు అదిరిపోయాయి. ఇందులో ఈ భామిని నడకకు యువత ఫిదా అయింది. ఆ పాటను బేస్ చేసుకొని వీడియోలు పోస్టు చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు డిజిటల్ క్రియేటర్లు. ఇదే పాటపై 54 ఏండ్ల నీరూ సైనీ చేసిన నృత్య ప్రదర్శన టాక్ ఆఫ్ ది ఇన్స్టాగా నిలిచింది. చండీగఢ్‌కు చెందిన ఈ మహిళ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. తరచూ రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్‌కు దాదాపు 3.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే సైనీ స్టార్డమ్ అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్గా అదితిలా గజగామిని నడకతో ఉర్రూతలూగించింది.