అందాన్ని కాపాడుకోవడానికి.. ముఖంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. ఇతర శరీర భాగాలపై నిర్లక్ష్యం చూపుతుంటారు. ముఖ్యంగా, చర్మం మందంగా ఉండే మోచేతులు, మోకాళ్లను మరీ అశ్రద్ధ చేస్తుంటారు. దాంతో ఆయా భాగాలు నల్లగా మారిపోయి.. అందవిహీనంగా కనిపిస్తుంటారు. కాస్త శ్రద్ధ పెడితే.. మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లదనాన్ని పోగొట్టుకోవచ్చని బ్యుటీషియన్లు చెబుతున్నారు.