బాబా సాహెబ్‌ను తొలి పురుష ఫెమినిస్ట్‌గా అభివర్ణిస్తారు చరిత్రకారులు. స్త్రీ విద్య, హక్కులతో ముడిపడిన అనేక అంశాలకు పట్టుబట్టి రాజ్యాంగంలో చోటు కల్పించారు. వివిధ సందర్భాల్లో అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలూ అంతే పదునుగా ఉన్నాయి..

సమాజ ప్రగతికి మహిళ ప్రగతే కొలమానం.
ఆమెకు అందని విద్య, ఆమె ఉనికి లేని ఉద్యమాలు, ఆమెకు చోటు దక్కని సమానత్వం.. అర్థం లేనివి.
వ్యవస్థలో మార్పు తీసుకురాగల శక్తి ఒక్క మహిళకే ఉంది.
బిడ్డకు జన్మనివ్వడానికి ముందు, తర్వాత.. ఆమెకు విశ్రాంతి అవసరం. ఇది మహిళకే కాదు, జాతికీ అవసరమే.
మహిళలూ.. చదువుకోండి. చేతులు కలపండి. పోరాడండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి.
రాయడం నేర్చుకుంటే.. ఆమె తలరాత మార్చుకుంటుంది. చదవడం నేర్చుకుంటే బిడ్డలనూ చదివిస్తుంది. స్త్రీ విద్య సమాజానికి ఎంతో అవసరం.