వ్యక్తి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్ : యూజర్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంపై అలర్ట్
ఓ వ్యక్తి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో పాటు శ్వాస తీసుకునే వేగం పెరగడంతో యాపిల్ వాచ్ సదరు యూజర్‌ను అలర్ట్ చేసింది.
న్యూయార్క్ : తీవ్ర అనారోగ్య లక్షణాలను గుర్తించి ఆయా వ్యక్తులను అప్రమత్తం చేయడం ద్వారా యాపిల్ వాచ్ ఎంతోమంది యూజర్ల విలువైన ప్రాణాలను కాపాడిన ఉదంతాలు వెల్లడయ్యాయి. తాజాగా ఓ వ్యక్తి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో పాటు శ్వాస తీసుకునే వేగం పెరగడంతో యాపిల్ వాచ్ సదరు యూజర్‌ను అలర్ట్ చేసింది. యాపిల్ వాచ్ సకాలంలో స్పందించి తన ప్రాణాన్ని కాపాడిందని, తనకు ఎదురైన అనుభవాన్ని తెలుసుకుని తన స్నేహితులు సైతం యాపిల్ వాచ్‌ను కొనుగోలు చేశారని కునిహన్ చెప్పుకొచ్చారు.
ఓ రోజు తాను శ్వాస తీసుకునే వేగం అసాధారణంగా పెరగడాన్ని గుర్తించిన యాపిల్ వాచ్ తనను అలర్ట్ చేసిందని, నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నామనేది యాపిల్ వాచ్‌లో రెస్పిరేటరీ రేట్ వెల్లడిస్తుందని చెప్పారు. వాచ్ హెల్త్ ట్రెండ్స్ సెక్షన్లో తన ఆరోగ్య పరిస్ధితి గురించి నోటిఫై చేయగా కుటుంబ సభ్యుల సూచనతో ఆస్పత్రిలో చేరానని తెలిపారు. ఆస్పత్రిలో తనకు ఎక్స్‌రే తీసి బ్రాంకైటిస్‌కు మందులు ఇచ్చారని కునిహన తెలిపారు. ఇక అదేరోజు తన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని యాపిల్ వాచ్ మరో అలర్ట్ పంపిందని ఆపై ఇతర వివరాలను పరిశీలించిన మీదట వైద్యులు సీటీ స్కాన్ చేయాలని సూచించారని గుర్తుచేసుకున్నారు.
సీటీ స్కాన్ రిపోర్ట్ ప్రకారం అతడి లంగ్స్ అంతటా రక్తం గడ్డకట్టినట్టు వెల్లడైంది. దీంతో కునిహన్కు వైద్యులు రక్తాన్ని పలుచన చేసే మందులు ఇచ్చారు. ఈ పరిస్ధితిలో తనను యాపిల్ వాచ్ కాపాడిందని, తన శరీరంలో మార్పులను గుర్తించకుంటే తనకు ప్రాణాపాయం ముంచుకొచ్చేదని కునిహన్ పేర్కొన్నారు. తాను ఆరాత్రి మేలుకుని వైద్యులను సంప్రదించకుంటే మరుసటి రోజు నిద్ర లేచేవాడిని కాదని అన్నారు.
Read More :
Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!
Health Tips | మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నారా.. అయితే ఈ పండు మీకు చక్కటి పరిష్కారం..!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Apple Watch
- life
- Save
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

