సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలలో మహిళల ప్రగతిని విశ్లేషిస్తుంది.. జెండర్ సోషల్ నామ్స్ ఇండెక్స్ (జీఎస్ఎన్ఐ). ఆ సంస్థ తాజా నివేదికలోని గణాంకాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. దాదాపు ఐదేండ్ల నాటి పరిస్థితులే ఇప్పుడూ రాజ్యమేలుతున్నాయి. కార్పొరేట్ బోర్డ్‌రూమ్ నుంచి పంచాయతీ ఆఫీసు వరకూ స్త్రీల పట్ల చిన్నచూపే. ప్రపంచ జనాభాలో సగానికిపైగా ఉన్నా .. నాయకత్వ స్థానాల్లో మాత్రం ఇరవై ఎనిమిది శాతానికి మించడం లేదు. శ్రమ ఒకటే. పారితోషికం మాత్రం అతనికంటే తక్కువ. ఈ అంతరం తగ్గిపోవడానికి ఇంకో 130 సంవత్సరాలు పడుతుందని అంచనా. మహిళా సాధికారత విషయానికొస్తే.. 146 దేశాల జాబితాలో భారత్ 127వ స్థానంలో ఉంది. అంతేకాదు..