ఫొటోలతోపాటు వీడియోలూ.. జ్ఞాపకాలను పదిలపరుస్తాయి. కరిగిపోయిన కాలాన్ని కళ్లముందు ‘ప్లే’ చేస్తాయి. అయితే, సాధారణ వీడియోలు కాలానికి అనుగుణంగా కదులుతుంటాయి. కానీ, టైమ్ లాప్స్, స్లో మోషన్ వీడియోలు భిన్నంగా ఉంటాయి. వేగంగా కదులుతూ.. మెల్లిగా సాగిపోతూ సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఖరీదైన కెమెరాలు లేకుండానే.. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో ఇలాంటి విభిన్నమైన వీడియోలను అద్భుతంగా రికార్డ్ చేయవచ్చు!
టైమ్ లాప్స్ వీడియోగ్రఫీ..
టైమ్‌లాప్స్ అనేది గడిచే సమయాన్ని వేగంగా చూపించడం. నిమిషాలు, గంటల్లో జరిగే కదలికలను.. కొన్ని సెకన్లలోనే చూపిస్తుంది. ఈ రకమైన వీడియోలో ప్రతి కొన్ని సెకన్లకు ఒక ఫ్రేమ్ రికార్డ్ అవుతుంది. తర్వాత ఆ ఫ్రేమ్‌లు అన్నీ కలిపి.. వేగంగా ప్లేచేస్తుంది. అలా.. టైమ్ లాప్స్ వీడియో వస్తుంది.
ఏమేం తీయవచ్చు?
ఆకాశంలో కదిలే మేఘాలు, సూర్యోదయం/ సూర్యాస్తమయం వేళల్లో తీసే టైమ్ లాప్స్ వీడియోలు అద్భుతంగా వస్తాయి. ఇక రోడ్డుపై వెళ్తున్న వాహనాలు, బిజీ ఏరియాలో జనసంద్రం కదలికలనూ టైమ్ లాప్స్ మోడ్‌లో తీయొచ్చు. మొక్కల ఎదుగుదల క్రమాన్నీ ఈ రకమైన వీడియోలతో కళ్లకు కట్టినట్టు చూపించొచ్చు.
ఎలా తీయాలి?
టైమ్ లాప్స్ వీడియో తీయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, మీ స్మార్ట్‌ఫోన్‌ను ట్రైపాడ్‌పై అమర్చుకోవాలి. ఎక్కువ కదలికలు ఉండే సన్నివేశాలను సబ్జెక్ట్‌గా ఎంచుకోవాలి. కెమెరాను ఆన్ చేసి, అందులో టైమ్ లాప్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ ఫోన్, స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి 5 నిమిషాల నుంచి 1 గంట వరకూ టైమ్ లాప్స్ వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు.
China4
స్లో మోషన్ వీడియోగ్రఫీ..
సాధారణ వేగంతో జరిగే సంఘటనలను అతి నెమ్మదిగా చూపించడమే.. స్లో మోషన్ వీడియోగ్రఫీ. ఎంచుకున్న సబ్జెక్ట్ ప్రతి కదలికనూ స్పష్టంగా చూపించడంలో.. ఈ రకమైన వీడియోగ్రఫీ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఏమేం తీయవచ్చు?
పైనుంచి నీటి చుక్కలు పడటం, ఇంట్లో చిన్నపిల్లల కేరింతలు, అలలపై సర్ఫింగ్, వేగంగా దూసుకెళ్లే వాహనాలను నెమ్మదిగా చూపించొచ్చు. ఇక మీరు వైల్డ్ లైఫ్‌ను ఇష్టపడితే.. ఎగిరే పక్షులు, జూలు విదిల్చే సింహాలు, పరుగులు పెట్టే జింకలు ఇలా ప్రకృతిలోని ప్రతి జీవినీ స్లో మోషన్ వీడియోలో అద్భుతంగా రికార్డ్ చేయవచ్చు.
ఎలా తీయాలి?
స్లో మోషన్ వీడియో తీయాలన్నా.. మీ స్మార్ట్‌ఫోన్‌ను ట్రైపాడ్పైనే అమర్చుకోవాలి. కెమెరా యాప్‌లో స్లో మోషన్ మోడ్‌ను ఎంచుకోవాలి.
వేగంగా కదులుతున్న సబ్జెక్ట్‌పై ఫోకస్‌పెట్టి.. వీడియో రికార్డ్ చేయాలి. స్లో మోషన్ వీడియో కోసం లైటింగ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఐఫోన్, సామ్సంగ్, రెడ్మీ లాంటి ఫోన్లలో టైమ్ లాప్స్, స్లో మోషన్ ఆప్షన్లు ఇన్‌బిల్ట్‌గానే ఉంటాయి. ఒకవేళ మీ ఫోన్లో అలాంటి ఆప్షన్స్ లేకుంటే.. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ కెమెరా, లాప్స్ ఇట్, మైక్రోసాఫ్ట్ హైపర్‌లాప్స్, స్లోమోషన్ వీడియో ఎఫ్ఎక్స్ లాంటి యాప్స్ ఉపయోగకరంగా ఉంటాయి.
ఎడిటింగ్ సలహాలు
పాటించాల్సిన నియమాలు
…? ఆడెపు హరికృష్ణ