పిరమైనా.. ప్రియమైనవే!
వేసవి ముదిరేకొద్దీ హిమక్రీముల మహిమ రెట్టింపు అవుతుంది. ఐస్‌క్రీమ్‌లకు ప్రత్యేకమైన సీజన్ లేకపోయినా.. ఎండలు మండేకాలం వీటికి ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఏడాది పొడవునా సాగే ఐస్‌క్రీమ్ విక్రయాలతో పోలిస్తే వేసవిలోనే 60 శాతం అమ్మకాలు సాగుతాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వేసవి ముదిరేకొద్దీ హిమక్రీముల మహిమ రెట్టింపు అవుతుంది. ఐస్‌క్రీమ్‌లకు ప్రత్యేకమైన సీజన్ లేకపోయినా.. ఎండలు మండేకాలం వీటికి ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఏడాది పొడవునా సాగే ఐస్‌క్రీమ్ విక్రయాలతో పోలిస్తే వేసవిలోనే 60 శాతం అమ్మకాలు సాగుతాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో ఎండలు మండే కాలాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఐస్‌క్రీమ్ ఉత్పత్తి సంస్థలు రకరకాల ఫ్లేవర్లు మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. అంతేకాదు ఐస్‌క్రీమ్ ప్రియులను ఆకట్టుకోవడానికి భారీస్థాయిలో ప్రచారమూ నిర్వహిస్తుంటాయి.
మదర్ డెయిరీ పదిహేను రకాల కొత్త ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌లను ఇటీవల లాంచ్ చేసింది. హావ్మోర్ ఐస్‌క్రీమ్ సంస్థ గతేడాది ఐపీఎల్ విజేత గుజరాత్ టైటన్స్ జట్టుకు పార్ట్నర్గా వ్యవహరిస్తున్నది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. గతేడాదితో పోలిస్తే హిమక్రీముల ధర భారీగా పెరగడం ఐస్‌క్రీమ్ ఆరాధకులకు మింగుడుపడటం లేదు. వీటి ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని వాళ్లు పెదవి విరుస్తున్నారు. పాలతోపాటు ఐస్‌క్రీమ్ ఉత్పత్తిలో వాడే ముడిసరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో రేటు పెంచక తప్పలేదని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి! ఈ ముచ్చట ఎలా ఉన్నా.. వేసవి సాయంత్రం ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించడాన్ని విధిగా భావించే వాళ్లు మాత్రం ‘పిరమైనా.. హిమక్రీములు మాకు ప్రియమైనవే!’ అని ముక్తాయింపు ఇస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

