ఓ మహిళకు రెండో కాన్పు జరిగి ఆపరేషన్ థియేటర్లో ఉండగానే, డాక్టర్లు అడిగే ప్రశ్న… ‘ట్యూబెక్టమీ’ చేయించుకుంటారా?’ అని. కానీ పురుషులను వాసెక్టమీ చేయించుకోమని అడిగేవారు తక్కువ. జనాభా నియంత్రణ బాధ్యత మహిళలదే అనుకుంటారు! కానీ, ఈ విషయంలో మహిళలు సమాన బాధ్యతను ఆశిస్తున్నారు. అందుకు ఉదాహరణగా శృతి హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. ‘కుటుంబం గురించి, పిల్లల పెంపకం గురించి మహిళలు ఎంతో శ్రమిస్తారు. మరి పిల్లలు కనడం దగ్గరికి వచ్చేసరికి, ఆ నిర్ణయం మగవారి చేతుల్లో ఉండటం సబబు కాదు కదా. ఈ విషయమై భార్య ఏమనుకుంటుందో తనతో సంప్రదించాలి. బర్త్ కంట్రోల్ విషయంలో తాము కూడా బాధ్యత తీసుకోవాలి’ అంటున్నారు శృతి హాసన్. ఇది కేవలం తన అభిప్రాయమే కాకపోవచ్చు. అందరి మహిళలూ అనుకునేదేనేమో! మరి ఈ విషయాన్ని మగవారు వింతగా కాకుండా, కొంతైనా బాధ్యతగా భావిస్తే మేలే కదా!!