ఒకప్పుడు కాలర్ అనేది అమెరికన్ డాలర్ కంటే విలువైంది. దానిపై సర్వహక్కులూ మగవాడికే ఉండేవి. కాలర్ ఎగరేస్తూ జెండా ఎగరేసినంత గొప్పగా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు మహిళల ఫ్యాషన్‌లోనూ కాలర్ ఓ భాగమై కూర్చుంది. డ్రెస్ డిజైనర్లు మెలితిరిగిన కాలర్లతో మ్యాజిక్ చేస్తున్నారు. జువెలరీలోనూ భాగం చేస్తున్నారు. ఊలుతోనో, పూసలతోనో హ్యాండ్‌మేడ్ కాలర్ నెక్లెస్ తయారు చేస్తున్నారు.
రంగుల హంగులో అవి నవరత్న హారాలతో పోటీపడతాయి. ధర చౌక. ప్రతి సందర్భానికి ఓ హారం కొనుక్కోవచ్చు. మహా తేలిక. ఎంతసేపు ధరించినా చికాకుగా ఉండదు. జపనీస్ పూసలతోనూ అందుబాటులోకి వస్తున్నాయి. కొంత యాంటిక్ లుక్ కూడా తోడవుతున్నది.