బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 27, 2020 , 23:48:55

వడివడిగా పల్లె ప్రగతి

వడివడిగా పల్లె ప్రగతి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో మొదటి, రెండో విడుతల్లో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టగా, ఇం దులో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పల్లె ప్రగ తి పనులపై ప్రతి వారం జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహిస్తూ, త్వ రగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. ము ఖ్యంగా వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని హరితహారం మొక్కలకు నీటిని సరఫరా చేసే చర్యలపై ప్రధాన దృష్టి పెట్టారు. ఇప్పటికే జిల్లాలోని 90 శాతం పంచాయతీలకు ట్రాక్ట ర్లు అందుబాటులోకి రావడంతో, వాటికి ట్రా లీలు, నీటి ట్యాంకర్లను సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హరితహారం నర్సరీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడంపై కూడా దృష్టి పెట్టారు.

ఇప్పటికే 316 జీపీలకు ట్రాక్టర్లు

గ్రామాల్లో పారిశుధ్యం, నీటి అవసరాలు తీర్చడంతో పాటు మొక్కల సంరక్షణకు ప్రభు త్వం ఒక ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంకర్‌ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇ ప్పటికే జిల్లాలో 334 గ్రామ పంచాయతీల్లో 316 జీపీలకు ట్రాక్టర్లను అందుబాటులోనికి తెచ్చింది. మిగితా ట్రాక్టర్లు త్వ రలోనే అందజేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో ట్రాలీ లు, వాటర్‌ ట్యాంకర్లను గొనుగోలు చేయడంపై దృష్టిసారించారు. 49 పంచాయతీలకు ట్రాలీలు, 56 జీపీలకు ట్యాంకర్లు అందజేయగా, మిగతా వాటికి కూడా త్వరలోనే పం పిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గ్రామానికో నర్సరీ..

పల్లె ప్రగతిలో భాగంగా గ్రామానికో నర్సరీకి స్థలం కేటాయించిన అధికారులు, వచ్చే వానాకాలంలో హరితహారం కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను పెంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నా రు. మొక్కలకు అవసరమైన కవర్లు, విత్తనాలు వితనాలను సమకూర్చుకుంటున్నారు. పంచాయతీలకు ట్రాక్టర్లతో పాటు వాటర్‌ ట్యాంకర్లు కూడా అందుబాటులోకి రానుండడంతో మొక్కల పెంపకానికి నీటి సమస్య దూరమైంది. గ్రామాల్లో నర్సరీల పనులను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశించారు.

శాశ్వత పనులపై దృష్టి

 గ్రామాల్లో శాశ్వత పనులపై అధికారులు దృష్టి సారించారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను ఏర్పాటు చేసే పనులు వేగవంతం చేశారు.. వారం రోజుల్లోగా జిల్లాలో సుమారు 20 వేల ఇంకుడు గుంతలను పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పారిశుధ్యం, మురుగు కాలువలు, రోడ్లు, విద్యుత్‌ సమస్యలు దూరమయ్యాయి. 


logo