బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 20, 2020 , 23:44:10

ష్‌.. గప్‌చుప్‌..

ష్‌.. గప్‌చుప్‌..
  • - కాగజ్‌నగర్‌లో ముగిసిన మున్సి‘పోల్స్‌' ప్రచారం
  • - ఆఖరి రోజు హోరెత్తించిన టీఆర్‌ఎస్‌
  • - అభివృద్ధి అస్ర్తాలతో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన
  • - పలుచోట్ల సభల్లో ప్రసంగించిన ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడింది. ప్రచారంలో భాగంగా వారం పాటు అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు వాడవాడనా హోరెత్తించారు. ఇక అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తీసుకున్న ఎమ్మెల్యే కోనప్ప ప్రతి వార్డులోనూ సభ నిర్వహించి, టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటేయాలని కోరారు. ఆయనతో పాటు సతీమణి రమాదేవి, కుమారుడు వంశీ ఎన్నికల వార్డుల్లో విస్తృత స్థాయిలో ప్రచారం ని ర్వహించారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మున్సిపాలిటీ పరిధిలోని పలు వా ర్డుల్లో ప్రచారం చేపట్టారు.

అభివృద్ధే అస్త్రంగా టీఆర్‌ఎస్‌

ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అభివృద్ధే ప్రధాన అ స్త్రంగా ఓటర్లకు వివరించారు. గత ఐదేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. తమను గెలిపిస్తే వార్డులను మరింత అభి వృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామనీ, ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని ప్రచారం చేశారు. అందుబాటులో ఉండి సేవలు అం దించే తమను గెలిపించాలని కోరారు. ఆయా వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనులతోపాటు,  రానున్న రోజుల్లో చేపట్టే పనులను వివరించారు.

ఎమ్మెల్యే కోనప్ప అన్నీ తానై..

అభివృద్ధి, సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తూ ప్రజలకు వెన్నంటి ఉండే సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్నీ తానై ముందుండి నడుస్తున్నారు. ఏ వార్డులో ప్రచారానికి వెళ్లినా, ఎమ్మెల్యే కోనప్పకు ఘన స్వాగతం పలుకుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న కోనేరు కోనప్ప మున్సిపాలిటి పరిధిలో గత ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు. ప్రతి వార్డులోనూ జరిగిన పనిని ఓటర్లకు గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్‌లో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో సమస్యలే లేకుండా చేస్తామని హామీనిచ్చారు.

గెలుపుపై ధీమా

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్‌ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. దీనికి ప్రధాన కారణం వార్డుల్లో వారి ప్రచారానికి వస్తున్న స్పందనే. వార్డుల్లో ప్రతి ఓటరును కలవడంతో పాటు సభలు నిర్వహిస్తూ ముందుకెళ్లారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపిస్తామని హామీ ఇస్తుండడంతో మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో గులాబీ పార్టీ విజయం ఖాయమని అభ్యర్థులు భావిస్తున్నారు.

విపక్ష అభ్యర్థులకు స్పందన కరువు

గెలుపుపై ముందే ఆశలు వదులుకున్న విపక్షాల అభ్యర్థులు వార్డుల్లో పెద్దగా ప్రచారాన్ని చేపట్టలేదు. బీజేపీ తరపున ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాల్లో పోటీలో ఉన్నప్పటికీ, అంతంత మాత్రంగానే ప్రచారం సాగింది. ఏ వార్డులో చూసినా, గులాబీ పార్టీ హవానే కనిపించింది.

మద్యం బంద్‌.. 144 సెక్షన్‌ విధింపు..

ఎన్నికల నేపథ్యంలో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.   సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమ లులో ఉండనున్నాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వ హించడం, నేరంగా పరిగణిస్తారు. అంతేకాకుండా మద్యం దుకా ణాలు, బార్లు, కల్లు దుకా ణాలను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మూసివేశారు.   22వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వాటిని అలాగే మూసి ఉంచనున్నారు. అక్రమంగా మద్యం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు పూర్తి ఏ ర్పాట్లు చేశారు. ఎక్కడా ఎ లాంటి ఇబ్బందులు కలుగ కుండా చూసేందుకు అధి కారులు ఎ ప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చేశారు. మరోవైపు వెబ్‌ కాస్టింగ్‌తో పాటు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.logo