భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సరంలో మరిన్ని ఆశలతో ముందుకు వెళ్దామని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన జడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రంగంలోనైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్పూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు.
అందరం కలిసి ముందుకు వెళితేనే ప్రగతి సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ వైస్ చైర్మన్ మోరే భాస్కర్, మార్కెట్ మాజీ చైర్మన్ రాంబాబు, ఎంపీటీసీ కూసన వీరభద్రం, మాజీ సర్పంచ్ రుక్మిణి, తెలంగాణ ఉద్యమకారులు హుస్సేన్, రాజు గౌడ్, బుజ్జి, మధు, ఐలయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, సంపు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.