కారేపల్లి, జనవరి 14 : మన సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని ఆయన స్వగ్రామం టేకులగూడెంలో సిపిఐ ఎంఎల్(మాస్ లైన్), పివైఎల్, పిఓడబ్ల్యు, పిడిఎస్యూ ఆధ్వర్యంలో భోగి సంబురాలను వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. క్రికెట్, వాలీబాల్ తో పాటు పలు రకాల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.

Karepally : సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
అనంతరం స్థానిక సర్పంచ్ గుమ్మడి సందీప్ అధ్యక్షతన జరిగిన ఉత్సవ ముగింపు వేడుకలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకుడు పోటు రంగారావు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలని, మన సంస్కృతి మనతోనే ఆగిపోకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు మన పండుగల విశిష్టతను వివరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Karepally : సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య