ఖమ్మం:వీలైనంత వేగంగా బాధితుల సమస్యలు పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఖమ్మంపోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజాదివాస్ కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన బాధితుల సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్తి, సివిల్ వివాదాలకు న్యాయస్థానాలను ఆశ్రయించాలని బాధితులకు సూచించారు.
ఫిర్యాదులపై చట్ట పరిధిలో తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నూతన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అదే విధంగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతులు స్వీకరించనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.