కొత్తగూడెంలో ఎయిర్పోర్టు పనులను వేగవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
- అనుమతులు త్వరగా మంజూరు చేయాలి
- రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
కొత్తగూడెం గణేశ్టెంపుల్, జూలై 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కొత్తగూడెంలో విమానాశ్రయం అవసరాన్ని పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు కేంద్రం ‘రాజ్ టెక్నాలజీస్’ సంస్థకు బాధ్యతలు అప్పగించగా, సుజాతనగర్ – సీతంపేట పరిసరాలు అనుకూలంగా గుర్తించినట్లు పేరొన్నారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసి అవసరమైన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఎంపీ కోరారు. భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రం, సింగరేణి ప్రధాన కార్యాలయం, కేటీపీఎస్, హెవీ వాటర్ప్లాంట్, కిన్నెరసాని ప్రాజెక్టు వంటి కీలక సంస్థలు జిల్లాలో ఉండడంతో విమానాశ్రయం ఏర్పాటుతో పర్యాటకం, పారిశ్రామిక, వాణిజ్యరంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని రవిచంద్ర ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులను కూడా వేగవంతం చేయాలని, ఖమ్మం – కొత్తగూడెం – భద్రాచలం రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించాలని, కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు, రైల్వేమార్గ విస్తరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

