ముదిగొండ, ఏప్రిల్ 02 : ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వల్లాపురం గ్రామ శివారులో గల స్మశాన వాటిక పక్కన మున్నేరు నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు ముదిగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని సిఐ మురళి పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో నీటిపై తేలియాడుతున్నది. మూడు రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.
మృతదేహం గుర్తుపట్టటానికి వీలులేకుండా ఉంది. మృతదేహం ఒక మధ్య వయస్కుడిదని, శరీరంపై నావీ బ్లూ కలర్ ప్యాంట్, నలుపు రంగు చొక్కా ఉంది. గత కొద్దిరోజులుగా ఎవరైనా కనిపించకుండా పోయినవారు లేదా ఆచూకి తెలిసిన వారు ముదిగొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 8712659129, ఎస్ఐ-8712566722, పోలీస్ స్టేషన్- 871269130.