కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 10 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న ప్రతి మండల కేంద్రంలో పాటు జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ నాయకుల పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆదివారం
కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తి ఐఎఫ్ టీ యూ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల విశ్వనాథం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకేఎస్) జిల్లా కార్యదర్శి అమర్లపూడి రాము, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు తుపాకుల నాగేశ్వరరావు, కార్మిక సంఘం తరఫున ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జే సీతారామయ్య , సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్,టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి వై గోపాలరావు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాలు విధిస్తామని, రష్యాతో వ్యాపార ఒప్పందానికి శిక్షాత్మక పన్నులు వేస్తామని చేసిన హెచ్చరికలను వారు తీవ్రంగా ఖండించారు.
అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఒక పక్క సలాం కొడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో పక్క భారత దేశంలో అమిత్ షా ఆదాని కార్పొరేట్ శక్తుల కోసం నూతన చట్టాలను తీసుకువచ్చి కార్మిక వ్యవసాయ రంగాలను ప్రైవేటుపరం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ట్రంపు సుంకాలను, కార్పొరేట్ దోపిడిని, నూతన ఎంఎస్పీ చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని అందులో భాగంగానే ఈ నెల 13న నిర్వహించనున్న బ్లాక్ డే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎస్ జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రేపాకుల శ్రీనివాస్, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్, కార్మిక సంఘ నాయకులు ఐఎఫ్టియు గౌని నాగేశ్వరరావు, మారుతి రావు, అలీముద్దీన్, వెంకన్న, వెంకటేశు, ఐఎన్ టియుసి నాయకులు వజీర్ తదితరులు పాల్గొన్నారు.