విత్తన నిల్వపై బోర్డులు పెట్టాలి
వ్యాపారులు తమ తమ దుకాణాల ఎదుట విత్తన, ఎరువుల నిల్వలు తెలి పేలా తెలుగులో అర్థమయ్యే విధంగా బోర్డుపై ప్రదర్శించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు.
- మార్కెట్లో 240 రకాల విత్తనాలు లభ్యం
- అందుబాటులో అన్ని రకాల విత్తనాలు
- కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం వ్యవసాయం, జూన్ 6 : వ్యాపారులు తమ తమ దుకాణాల ఎదుట విత్తన, ఎరువుల నిల్వలు తెలి పేలా తెలుగులో అర్థమయ్యే విధంగా బోర్డుపై ప్రదర్శించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. నగరంలోని గాంధీ చౌక్, బర్మాషెల్ రోడ్లో గల విత్తన, ఎరువుల దుకాణాలను గురువారం తనిఖీ చేసిన కలెక్టర్ స్టాక్ రిజిస్ట్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్‌లు, విత్తన బస్తాలపై లాట్ నెంబర్, ఎంఆర్పీ, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను నిశితంగా పరిశీలించారు. ఎరువులు, విత్తన విక్రయానికి పొందిన అనుమతుల పత్రాలను పరిశీలించడంతోపాటు ఏయే ప్రాంతాల నుంచి రైతులు ఎక్కువగా వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. గత సీజన్లో ఏ పంట సాగు చేశారు? ఏ రకం విత్తనాలు కొన్నారు? ఎంఆర్పీపై ఇస్తున్నారా? అదనంగా అడుగుతున్నారా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో 240 రకాల విత్తనాలు ఉన్నాయని, ప్రతి రకం ఒకే దిగుబడి ఇస్తుందన్నారు. రైతులందరూ ఒకే రకం కావాలని డిమాండ్ పెంచి ఇబ్బంది పడొద్దన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఎరువులు, విత్తన దుకాణాల్లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తాయన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే ఎంతటివారైనా సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో విత్తనాలకు ఎక్కడా కొరత లేదని, అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికల వద్ద విత్తన ఎంపికపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ మండల వ్యవసాయాధికారి కిశోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

