సాగర్ జలాల వాటాలో కోత
జిల్లాకు ఆశించిన మేరకు సాగర్ జలాలు విడుదల చేయకపోవడంపై ఆయకట్టు రైతులు పెదవి విరుస్తున్నారు. జలాలు చేరుకోకపోవడంతో ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుతున్నది. దీంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- ప్రతిసారి తగ్గుతున్న పాలేరు జలాశయ నీటిమట్టం
- చివరి ఆయకట్టుకు సాగునీరు అంతంతమాత్రం
కూసుమంచి, ఫిబ్రవరి 10: జిల్లాకు ఆశించిన మేరకు సాగర్ జలాలు విడుదల చేయకపోవడంపై ఆయకట్టు రైతులు పెదవి విరుస్తున్నారు. జలాలు చేరుకోకపోవడంతో ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుతున్నది. దీంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ జలాలతో జిల్లాలోని 17 మండలాల పరిధిలో 2.54 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందుతుంది. యాసంగిలో మాత్రం జలాలు కాస్త తగ్గుతాయి. జిల్లాకు సాలీనా 5,000 క్యూసెక్కుల నీటిని ఎగువ నుంచి విడుదల కావాల్సి ఉండగా 4000 క్యూసెక్కులు చేరుకోవడం గగనమైంది. ప్రతిసారి జరిగే విధంగానే ఈసారి కూడా అలాగే జరుగుతున్నది.
వారం రోజుల నుంచి పాలేరు రిజర్వాయర్ మట్టం తగ్గుతుండడమే అందుకు సాక్ష్యం. రిజర్వాయర్ పూర్తి స్థాయినీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 17 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా రైతులు వరిని విస్తారంగా సాగు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు వారబంధీ పద్ధతిలో దిగువకు జలాలు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి తక్కువలో తక్కువ 4,800 క్యూసెక్కుల నీటిని జలాశయానికి విడుదల చేయాల్సి ఉండగా వారం రోజుల నుంచి 3,900 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుకుంటున్నది. దీంతో చివరి ఆయకట్టు ప్రాంతాలైన బోనకల్లు, మధిర బ్రాంచ్ కాలువలకు అంతంతమాత్రంగా నీరు సరఫరా అవుతున్నది. మరోవైపు వేసవి సమీస్తుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

