ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 1 : పదో తరగతి వార్షిక పరీక్ష పేపర్లు తగ్గడంతో వాల్యుయేషన్ ప్రక్రియకు సమయం కూడా తగ్గింది. రెండేళ్ల నుంచి స్పాట్ వాల్యుయేషన్ విధానం సులువుగా మారింది. గతంలో 6 లక్షల సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేయాల్సి వస్తే.. ఈ ఏడాది కేవలం 2,10,840 మాత్రమే కేటాయించారు. జిల్లాకు తగ్గిన పేపర్లతో స్పాట్ వాల్యుయేషన్‌కు వారం రోజులు మాత్రమే పట్టనున్నది.
నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పదో తరగతి మూల్యాంకనం ప్రక్రియ ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు సాగనున్నది. తొలుత పరీక్షల విభాగం అధికారులు ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించినా.. జిల్లాకు పేపర్లు తక్కువగా కేటాయించడంతో వాల్యుయేషన్ వారం రోజుల్లో ముగియనున్నది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. కోడింగ్ ప్రక్రియ పూర్తయింది. సీఈలు, ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్లకు ఆర్డర్లు సైతం అందజేశారు.
జిల్లాకు అత్యధికంగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు సంబంధించిన పేపర్లు కేటాయించారు. ఇంగ్లిష్‌లో 45,339 పేపర్లు కాగా.. అత్యల్పంగా సోషల్ స్టడీస్‌లో 15,980 పేపర్లు ఉన్నాయి. తెలుగులో 30,265, హిందీ 32,142, గణితం 20,423, ఫిజికల్ సైన్స్ 36,012, బయాలజీలో 30,319 పేపర్లు కేటాయించారు. వీటి వాల్యుయేషన్ పూర్తి చేసేందుకు డిమాండ్‌కు అనుగుణంగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు అత్యధికంగా ఏఈ(అసిస్టెంట్ ఎగ్జామినర్స్) 126 మందిని నియమించారు. సీఈలు 100 మంది, ఏఈలు 585, స్పెషల్ అసిస్టెంట్లు 200 మంది విధుల్లో పాల్గ్గొన్నారు. వీరిలో సబ్జెక్ట్‌లవారీగా ఏఈలు తెలుగు 84, హిందీ 89, ఫిజికల్ సైన్స్ 100, బయాలజీ 84, సోషల్ 45, గణితం పేపర్లను 57 మంది వాల్యుయేషన్ చేయనున్నారు.
స్పాట్లో పాల్గొనే ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్ వాడేందుకు అనుమతి లేదని ఇప్పటికే డీఈవో సోమశేఖర శర్మ ఆదేశించారు. స్పాట్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరైనా ధర్నాలు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పేపర్ వాల్యుయేషన్‌లో అప్రమత్తంగా ఉండాలని, రీవాల్యుయేషన్లో మార్కులు పెరిగితే తప్పుగా వాల్యుయేషన్ చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు.
కూసుమంచి, ఏప్రిల్ 1 : 2024-2025 విద్యా సంవత్సరానికి పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం విడుదల చేశారు. జనవరి 20న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 3,140 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2,492 మంది పరీక్ష రాశారు. వారిలో కేటగిరీలవారీగా 80 మంది విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించారు.
సీట్లు సాధించిన విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లు ఇలా ఉన్నాయి. ఎం.3462774, ఎం.3464573, కె.3464 588, ఒ.3464750, ఎన్.3462849, ఎఫ్. 3463104, జె.3463221, జె.3464177, జె.3464480, కె.3462142, జి.3464496, కె.3464620, ఎల్.3464966, జె.3465050, ఎల్.3465195, ఎల్.3464775, ఎల్ .3464838, ఎల్.3464965, పి.3465075, ఎల్.3565127, ఎల్.3462143, ఐ.3462379, జె.3462529, జె.3462718, ఒ.3462740, జె.3462764, జె.3463111, జె.3463140, జె.3463388, జె.3464182, ఎల్.3464272, కె.3464446, జె.3464495, ఎన్.3464557, జె.3464699, కె.3464856, ఎన్.3465068, జె.3465101, ఎన్.3465144, జె.3462951, జె.3462953, జె.3463151, జె.3463444, జె.3463941, ఎన్.3464376, జె.3463622, జె.3464634, జె.3463637, ఎల్.3463677, ఎన్.3464679, జె.3464702, జె.3464711, జె.3474746, ఎన్.3464778, ఎన్.3464780, ఒ.3462703, ఒ.3462860, కె.3462930, కె.3462966, కె.3463277, కె.3463446, ఒ.3463500, ఒ.3463594, ఒ.3464417, ఒ.3464825, పి.3462134, పి.3462208, ఎల్.3462229, పి.3462372, పి.3462730, ఎల్.3462796, ఎల్.3463236, పి.3463518, ఎల్.3463922, పి.3464298, పి.3464362, ఎల్.3464770, పి.3464873, ఎల్.3465201, ఎల్.3465205.