లక్ష్మీదేవిపల్లి, జూలై 3 : మండలంలోని శ్రీనగర్‌కాలనీ పంచాయతీలో ఉన్న ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు జిల్లాస్థాయి స్వచ్ఛ పురస్కారం లభించింది. విద్యాశాఖ జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ సైదులు ఈ విషయాన్ని హెచ్ఎం మేకల జ్యోతిరాణికి తెలిపారు. ఈ నెల 5వ తేదీన కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని హెచ్ఎం అందుకోనున్నారు.
స్వచ్ఛత విషయంలో ఈ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గతంలో ప్రశంసలు లభించాయి. వరుసగా రెండోసారి స్వచ్ఛ పురస్కారం లభించింది. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం లీల, శ్రీనగర్ సర్పంచ్ పూనెం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ కొల్లు పద్మ, పంచాయతీ కార్యదర్శి ముజాహిద్ పాషా, ఎస్ఎంసీ చైర్మన్ ఎండీ చాంద్‌పాషా, సభ్యులు, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.