ఇల్లెందు, అక్టోబర్ 16 : ఇల్లెందు నేచర్ పార్క్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో జీవ వైవిధ్యం పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీజడ్సీ విద్యార్థులకు కళాశాల అధ్యాపకురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో ఇల్లెందు నేచర్ పార్క్ నర్సరీలో ఉన్న ఔషధ మొక్కలు, నర్సరీలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు జీవవైవిద్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రొఫెసర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అవగాహన కల్పించడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ప్రతి విషయాన్ని సున్నంగా పరిశీలించి అవగాహన పెంచుకుంటారని అన్నారు. అలాగే క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులు జనరిక్ మెడికల్ షాపును సందర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎం. వెంకటేశ్వరరావు, రాకేష్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుజాత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.