మధిర, ఆగస్టు 05 : వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందకుండా ప్రతి పారా మెడికల్ సిబ్బంది ప్రతి రోజు డ్రై డే చేపట్టాలని, అలాగే ఫీల్డ్ లెవల్ లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందిని కలుపుకుని పని చేయాలని ఖమ్మం డీఎంహెచ్ఓ బానోత్ కళావతిబాయి అన్నారు. మంగళవారం మధిర మండలం దెందుకూరిలోని పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ఆరోగ్య సిబ్బంది హాజరు పట్టిని పరిశీలించారు. ఫీల్డ్ విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను డాక్టర్ పృథ్వీని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం కాన్పులు చేయాలన్నారు. అనంతరం మహాదేవపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న పల్లె దావఖానా పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి.వెంకటేశ్వర్లు, డాక్టర్ చెరుకూరి దివ్య శృతి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.