బీఆర్ఎస్కే పట్టం కట్టండి
సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
- సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం
- మరోమారు గెలుపుతో అర్హులందరికీ పథకాలు
- పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ‘డబుల్’ పథకం
- ‘డబుల్’ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్‌కుమార్
- ఖమ్మంలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు శంకుస్థాపన
ఖమ్మం/ రఘునాథపాలెం, అక్టోబర్ 3 : సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మళ్లీ గెలిస్తేనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని అ న్నారు. ఇల్లులేని నిరుపేదలు సొం తింట్లో ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి శ్రీకారం చు ట్టిందని అన్నారు.
ఖమ్మం వైఎస్ఆర్నగర్లో రూ.5.08 కోట్లతో నిర్మించిన 91 డబుల్ బెడ్ రూం ఇళ్లను, నూతన ప్రభుత్వ పాథమిక పాఠశాలను కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి మంత్రి అజయ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ డబుల్ బెడ్ రూం ఇళ్ల లోపలికి వెళ్లి నాణ్యతను, డిజైన్‌ను, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని నిరుపేదలందరూ ఆత్మగౌరవంతో బతికేందుకు వారికి గూడు కల్పించడమే సీఎం కేసీఆర్ ఉద్దేశమని స్పష్టం చేశారు. దీంతో పేదల సొంతింటి కల సాకారమవుతోందని అన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు శంకుస్థాపన
ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రూ.2.48 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 4, 30, 51, 52 డివిజన్లలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారను. 34వ డివిజన్ రంగనాయకుల గుట్ట నిర్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ పారు ప్రారంభించారు. స్పోర్ట్స్ కిట్లు, టీ షర్టులు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ..
ఖమ్మం నగరంలో ఇప్పటికే అన్ని రోడ్లు, కాలువల నిర్మాణాలను పూర్తి చేశామని, ఇం కా మిగిలి ఉన్న అరకొర పనులు కూడా పూర్తి చేసి నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గొంగళిపురుగులా ఉన్న ఖమ్మాన్ని సీతాకోకచిలుకలా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో 606 తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్, బీ.సత్యప్రసాద్, ఆదర్శ్ సురభి, దండా జ్యోతిరెడ్డి, ముకాల కమల, బుర్రి వెంకట్‌కుమార్, రుద్రగాని శ్రీదేవి, పసుమర్తి రామ్మోహన్, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, శ్యాంప్రసాద్, వాంకుడోతు సురేశ్, మోహన్, కమర్తపు మురళి, గొల్లపూడి రాంప్రసాద్, భుక్యా భాషా, అజ్మీరా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

