భద్రాచలం, ఏప్రిల్ 15 : భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి ఏటా సిరిసిల్లలో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరను అందిస్తున్నారు వెల్లి హరిప్రసాద్. ఈ ఏడాది 800 గ్రాముల బరువు గల చీరను 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టుధారాలతో నేశారు. అంతేకాక సీతారాముల కల్యాణ చిత్రాన్ని చీర కొంగుపై వేయడంతో చూడముచ్చటగా కనిపిస్తోంది.