బహుజనులకు బాసటగా బీఆర్ఎస్
చరిత్రలో తొలిసారిగా ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో దాదాపు అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఎక్కడ చూసినా జనరల్ స్థానాల్లో సైతం బీసీలకు అవకాశం కల్పించడంతో సబ్బండ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
- ఒక్కటి మినహా అన్ని సర్పంచ్ స్థానాలూ బడుగులకే..
- ఖమ్మం రూరల్ మండల చరిత్రలో ఇదే తొలిసారి
- హర్షం వ్యక్తం చేస్తున్న సబ్బండ వర్గాలు
ఖమ్మం రూరల్, నవంబర్ 30: చరిత్రలో తొలిసారిగా ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో దాదాపు అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఎక్కడ చూసినా జనరల్ స్థానాల్లో సైతం బీసీలకు అవకాశం కల్పించడంతో సబ్బండ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా బీఆర్ఎస్ పార్టీ 16 గ్రామాల్లో తమ అభ్యర్థులను పోటీ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఐదు గ్రామాల్లో సీపీఎం పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
ఒక్క స్థానంలో సీపీఐ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌ను బరిలో నిలిపేందుకు గాను ఉభయపార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. 21 పంచాయతీలకు గాను 11 స్థానాలు జనరల్‌కు రిజర్వుడు కాగా నాలుగు స్థానాలు ఎస్సీలకు, మూడు స్థానాలు బీసీలు, మరో మూడు స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అయితే బీఆర్ఎస్ 16 గ్రామాల్లో సీపీఎం మద్దతుతో పోటీ చేస్తుండగా ఒకే ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేసి అధికార పార్టీకి సవాల్ విసిరిందని చెప్పవచ్చు.
బీఆర్ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు ఇప్పటికే మండల పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంలో ఆదివారం పోలెపల్లి గ్రామంలో బీఆర్ఎస్, సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా షేక్ మహబూబ్ అలీ, మంగళగూడెంలో గంధం ఉపేందర్, గూడూరుపాడు గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్, సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా బండి సీతమ్మ అమ్మరాజుయాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాల్లో జరిగే నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఖమ్మంరూరల్ సీఐ ముష్కారాజ్ తన సిబ్బందితో కలిసి పర్యవేక్షణ చేశారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు యండపల్లి ప్రసాద్, మంకెన నాగేశ్వరరావు, అల్లిక వెంకటేశ్వరరావు, అక్కినపల్లి వెంకన్న, మరికంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

