శ్రీరాంపూర్, జనవరి 31: విధి నిర్వహణలో సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ఆర్కే 6గనిలో సీనియర్ మైనింగ్ సర్దార్‌గా ఉద్యోగ విరమణ పొందిన టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి దొమ్మెటి పోశెట్టి, బండ శంకర్‌ను ఏజెంట్ ఏవీ రెడ్డి, మేనేజర్ తిరుపతి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డితో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ 30 ఏండ్ల పాటు విధులు నిర్వర్తించి, విరమణ పొం దుతున్న వారంతా శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాం క్షించారు.
సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్, వెంటిలేషన్ ఆఫీసర్ రాంనర్సయ్య, ఈఈ శ్యాంకుమార్, టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధులు పెట్టం లక్షణ్, కుమారస్వామి, పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, భూమయ్య, వెంకట్రాజం పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీలో విరమణ పొందిన డీ వెంకటేశ్వర్లును మేనేజర్ జక్కులవార్ సుధీర్, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మల్లారెడ్డి ఘనంగా సత్కరించారు. బెనిఫిట్ చె క్కులు అందించారు.
ఈఈ చంద్రశేఖర్, సేఫ్టీ ఆఫీసర్ వీరయ్య, పిట్ కార్యదర్శి శంకరయ్య, సీనియర్ పీవో శంకర్ పాల్గొన్నారు. ఆర్కే న్యూటెక్ గనిపై విరమణ పొందిన వీ రాము టెండాల్, జె ట్టి బుచ్చయ్య, అల్లం రాజయ్య, తౌటం పోచమల్లును మేనేజర్ స్వామిరాజు సత్కరించారు. టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి బుస్స రమేశ్, సీనియర్ పీవో సైజన్పాల్, సర్వే ఆఫీసర్ ప చ్చేశ్వేర్రావు, వీరభద్రయ్య, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు. ఆర్కే 7గనిలో ఎర్రొళ్ల భగవంతుడు, సయ్యద్ శౌకత్ అలీఖాన్‌ను మేనేజర్ సాయిప్రసాద్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి మెండ వెంకటి సత్కరించారు.
సేఫ్టీ ఆఫీసర్ శంకర్, ఏరియా కార్యదర్శి భూపతి అశోక్, ఈఈ ప్రవీణ్, వాసుదేవేందర్, నాయకులు సారయ్య, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. ఆర్కే 5గనిలో భూక్యా జయత్రాం, భిక్షపతిని మేనేజర్ అ బ్ధుల్ ఖాదీర్, ఏజెంట్ ఏవీ రెడ్డి, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి ఆర్ మహేందర్‌రెడ్డి సన్మానించారు. సేఫ్టీ ఆఫీసర్ శివయ్య, సీనియర్ పీవో రణదీప్, ఈఈ రాధాకృష్ణ, సందీప్ పాల్గొ న్నారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గోషిక మల్లేశంను జీఎం ఆఫీస్‌లో జీఎం సంజీవరెడ్డి , ఆర్కే 5గనిపై ఏజెంట్ ఏవీ రెడ్డి, మేనేజర్ అబ్దుల్ ఖాదీర్ ఘనంగా సత్కరించారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ శివ య్య, డీవైజీఎం గో విందరాజు, పిట్ కార్యదర్శి పీవీ రావు, మహేందర్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో..
బెల్లంపల్లి,జనవరి 31: మందమర్రి ఏరియా శాంతిఖని గని జనరల్ మజ్దూర్ నాగుల రాజనర్సు దంపతులను గని ఆవరణలో మంగళవారం మేనేజర్ సంజయ్‌కుమార్ సిన్హా ఘనంగా సత్కరించారు. రక్షణాధికారి పీ రాజు,గ్రూప్ ఇంజినీర్ బసవరాజు, పిట్ ఇంజినీర్ రాంబాబు, బీఎం ఇన్ చార్జి ముస్తాఫా, ఇంజినీర్లు సైదులు, రాంసాగర్,ప్రవీణ్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి దాసరి తిరుపతిగౌడ్, పాల్గొన్నారు.
రెబ్బెన, జనవరి 31: ఏరియాలో ఉద్యోగ విరమణ పొం దిన 8 మందిని ఘనంగా సన్మానించినట్లు బెల్లంపల్లి ఏరి యా పీఎం ఐ.లక్ష్మణ్‌రావు తెలిపారు. గోలేటి జీఎం కార్యా లయంలో ఉద్యోగ విరమణ పొందిన వేముల లక్ష్మిని బెల్లంపల్లి ఏరి యా జీఎం దేవేందర్ శాలువా కప్పి సన్మానించారు. టీ బీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస రావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, పిట్ కార్యదర్శి గడ్డం రవీందర్, డీవైపీఎం రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పీవో కిరణ్ కుమార్, తదితరులున్నారు. కైర్‌గూడ ఓసీపీలో గంగిశెట్టి శ్రీనివాస్, గోవిందరావు, పెద్దల పోశంను ఘనంగా సన్మానించారు.
గని ఆవరణ లో వారికి జ్ఞాపికతో పాటు బెనిఫిట్స్ పత్రాలు అందించారు. పీవో ఉ మాకాంత్, మేనేజర్ ప్రవీణ్ ఫాటింగ్, వెల్పేర్ ఆఫీసర్ వేణు, టీబీ జీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, కార్పొరేట్ చర్చల ప్రతి నిధి మంగీలాల్, పిట్ కార్యదర్శి కార్నాథం వెంకటేశం, జీఎం కమిటీ సభ్యులు చంద్రశేఖర్, మారిన వెంకటేశ్వర్లు, మాజీ ఉపాధ్యక్షుడు న ల్లగొండ సదాశివ్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులు భాస్కరచారి, బొంగు వెంకటేశ్, కుడుదుల శ్రీనివాస్, మాసాడి నారాయణ, నాయకులు ఓ రం కిరణ్, కైత స్వామి, తదితరులున్నారు.
డైరెక్టర్‌కు ఘన సన్మానం
కొత్తగూడెం సింగరేణి, జనవరి 31: సంస్థలో మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన డైరెక్టర్ (ఓపీ అండ్ పా) చంద్రశేఖర్‌ను సింగరేణి ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనం గా సన్మానించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమాని కి డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావు హాజరయ్యారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు ఆధ్వ ర్యంలో 40 కేజీల గజమాల, పూల కిరీటంతో సన్మానించి బు ద్దుడి విగ్రహంతో సత్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడు తూ… వివిధ హోదాల్లో నిబద్ధతతో చంద్రశేఖర్ పనిచేశారని కొ నియాడారు. పర్సనల్ జీఎంలు ఆనందరావు, బసవయ్య, ఎస్ వోటు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం ఓసీపీ వైజీకే మూర్తి, సీఎం వో బీవీ రావు, జీఎం ట్రాన్స్‌పోర్టు దామోదర్‌రావు, ఏజీఎం ఐ ఈ గోనె శ్రీకాంత్, కనకయ్య, ఎస్సీ,ఎస్టీ లైజన్ ఆఫీసర్లు మాల కొండయ్య, చంద్రశేఖర్, మోరె రమేశ్ కుమార్, వెంకటేశ్వర్లు, అసోసియేషన్ సభ్యులు అంకూశ్, జిమ్మిడి మల్లేశ్, విజేందర్, సాయికృష్ణ, కేఎం విక్టర్, గణేశ్, శ్రీహరి, సుమన్, తదితరులు పాల్గొన్నారు.