కారేపల్లి, అక్టోబర్ 10 : కొవిడ్ సమయంలో రద్దైన రైళ్లలో ఇంకా రెండు రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదని, ఆ రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి డీఆర్ఎం గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. డీఆర్ఎం గోపాలకృష్ణ కారేపల్లి రైల్వే స్టేషన్కు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డోర్నకల్- భద్రాచలం రోడ్, మణుగూరు- కాజీపేట జంక్షన్ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, అలాగే డోర్నకల్ భద్రాచలం రోడ్ మధ్యలో నడుస్తున్న రైళ్లకు ఈ రైలు మార్గంలో ఉన్న అన్ని స్టేషన్లలో హాల్టింగ్ కల్పించాలని కోరుతూ డీఆర్ఎంకు సురేందర్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సురేందర్ మనియార్, తురక నారాయణ, బిచ్యా నాయక్, తోగర శ్రీను పాల్గొన్నారు.