Oil palm | సింగరేణి మండలంలో విస్తరిస్తున్న ఆయిల్‌పామ్ తోటలు
రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ చర్యలు చేపడుతోంది.
కారేపల్లి అక్టోబర్ 12 : రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ చర్యలు చేపడుతోంది. ఖమ్మం జిల్లా కారేపల్లి (సింగరేణి) మండల వ్యాప్తంగా ఇప్పటికే 176 మంది రైతులు సుమారు 500 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. సంప్రదాయ పంటలతో పాటు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తోంది.
ఈ క్రమంలో సింగరేణి మండలంలోని విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రైతు సూరపరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను సోమవారం ఉద్యానవన శాఖ ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ ముదిగొండ శ్రావణి సందర్శించారు. తోటలో ఆయిల్‌పామ్ మొక్కల పెరుగుదల, సాగు విధానం, నీటి వసతి,పంట నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతుకు పంట అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యానవన శాఖ ద్వారా అందించే సహాయంపై సాగుదారులకు వివరించారు. ఆయిల్‌పామ్ సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలను అందిస్తోందన్నారు. ఒక్కో మొక్క ధర రూ.193 ఉండగా రాయితీ ద్వారా రైతులకు రూ.20కే అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ రాయితీలతో రైతులపై ప్రారంభ పెట్టుబడి భారం తగ్గే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు తమ భూమి వివరాలు, నీటి వసతి, అర్హతలకు సంబంధించిన సమాచారంతో ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఆయిల్‌పామ్ సాగు కోసం ప్రభుత్వం అందించే సబ్సిడీకి సంబంధించి రైతుల వర్గం, భూమి విస్తీర్ణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు.
ఎస్సీ, ఎస్టీ రైతులకు 10 శాతం, బీసీ రైతులకు 20 శాతం,ఇతర కేటగిరీలకు చెందిన అర్హులైన రైతులకు 50 శాతానికి పైగా భూమి ఉన్న సందర్భాల్లో 70 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని వివరించారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తుందని, పంట సాగు చేసిన రైతులకు ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సహాయం పొందేందుకు అవసరమైన అర్హతలు, చెల్లింపు విధానం గురించి రైతులు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలన్నారు. పంట విస్తీర్ణం పెరిగే అవకాశముందని, అయితే ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కొత్తగా ఆయిల్‌పామ్ సాగుకు దరఖాస్తు చేసుకునే రైతులకు సంబంధించి కొన్ని పరిమితులు, ప్రత్యేక నిబంధనలు వర్తించే అంశంపై స్పష్టత కోసం రైతులు సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

