మధిర, మార్చి 20 : మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 27న జరుగనున్నాయి. అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అధ్యక్ష పదవికి బోజడ్ల పుల్లారావు, పల్లబోతుల కృష్ణారావు పోటీ చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు అనంతరం మిగిలిన నాలుగు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు చేశారు.
దాఖలు చేసిన నామినేషన్లలో ప్రధాన కార్యదర్శిగా జింకల రమేశ్, ఉపాధ్యక్షుడిగా గంధం శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా భైరవభట్ల రమణరావు, కోశాధికారిగా కాకాణి విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా అధ్యక్ష పదవికి ఇద్దరు బరిలో ఉండడంతో ఓటింగ్ 27న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగనున్నది. పోలింగ్ అనంతరం ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల అధికారి తెల్లూరి వెంకట్రావు తెలిపారు.