ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రెండోరోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అమ్మవారు బాలత్రిపురసుందరి దేవీ అలంకరణలో దర్శనమిచ్చారు. అనంతరం పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి నిత్యకళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల కృష్ణమోహన్శర్మ, ఆలయ సూపరిండెంట్ బీ.శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు యు.శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.