ఖమ్మం రూరల్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ పీకే శ్రీదేవి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు.
ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా హాలియా మున్సిపల్ కమిషనర్గా వెళ్లగా.. ప్రస్తుతం హాలియా మున్సిపల్ కమిషనర్ ఎం రామదుర్గారెడ్డికి కల్లూరు కమిషనర్గా నియమితులయ్యారు. కల్లూరు కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న రామచంద్ర రావు.. తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్గా బదిలీ కాగా తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ మున్వార్ అలీ ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా వెళ్లనున్నారు. బదిలీ అయిన కమిషనర్లు గురువారం ఆయా స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ పీకే శ్రీదేవి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.