పర్ణశాల, ఆగస్టు 31 : కాంట్రాక్టర్ తమకు రావాల్సిన ఐదు నెలల వేతనాలు చెల్లించడం లేదని, అధికారులు కూడా దీని గురించి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పర్ణశాల మిషన్ భగీరథ ఉద్యోగులు శనివారం విధులు బహిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ తమ వేతనాల గురించి కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే.. నాకు 18 నెలలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని, అందుకే వేతనాలు సకాలంలో చెల్లించలేకపోతున్నామని చెబుతున్నాడని అన్నారు. వేతనాలు సక్రమంగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, తమ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని ఉద్యోగులు కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఉద్యోగులు పవన్‌కుమార్‌రెడ్డి, దాస్, అశోక్, శ్రీను, సాయిచందు, శ్రీకాంత్, సోమరాజు, సతీశ్, కల్యాణ్ పాల్గొన్నారు.