అష్టదిగ్బంధం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మొక్కజొన్న లోడ్ లారీలు అష్ట దిగ్బంధం చేశాయి. శనివారం మార్కెట్ చుట్టుపక్కల రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటను నిల్వ చేసేందుకు ప్రభుత్వానికి గోదాములు లేకుండాపోయాయి.
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను చుట్టేసిన మొక్కజొన్న లారీలు
- దిగుమతి కోసం రోజులకొద్దీ నిరీక్షిస్తున్న వాహనాలు
- ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం.. నగరవాసులకు ఇబ్బందికరం..
- ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని మార్క్‌ఫెడ్ అధికారులు
రఘునాథపాలెం, మే 9: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మొక్కజొన్న లోడ్ లారీలు అష్ట దిగ్బంధం చేశాయి. శనివారం మార్కెట్ చుట్టుపక్కల రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటను నిల్వ చేసేందుకు ప్రభుత్వానికి గోదాములు లేకుండాపోయాయి. మిర్యాలగూడెం, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని గోదాములన్నీ ఇప్పటికే నిండిపోయాయి. అయితే కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ సంస్థ కొనుగోలు చేసిన మొక్కజొన్న పంట తరలింపులో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఈక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న పంటను తక్షణం తరలించాలనే ఉద్దేశంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన షెడ్లల్లో నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఈ నెల 18వ తేదీన సర్క్యులర్ జారీ చేశారు. అంతేకాదు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖమ్మం మార్కెట్ నూతన షెడ్లను మొక్కజొన్న పంట నిల్వలకు వినియోగిస్తున్నట్లు ప్రకటించారు. మరునాడే భారీగా మొక్కజొన్న లోడ్ వాహనాలు ఖమ్మం మోడల్ మార్కెట్‌కు పోటెత్తాయి. దీంతో మార్కెట్ చుట్టూ రహదారులన్నీ మొక్కజొన్న లోడ్ వాహనాలతో నిండిపోయాయి.

Khammam
త్రీటౌన్ ప్రాంతంలో నిత్యం నరకం..
ఒకపక్క ఖమ్మం మార్కెట్‌కు మిర్చి పంటతో వచ్చే వాహనాలు.. మరోపక్క కొత్తగా మొక్కజొన్న లోడ్ వాహనాల రాకతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి త్రీటౌన్ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. వాహనాలకు అనుగుణంగా దిగుమతి హమాలీలను సమకూర్చడంలో అధికారులు ఫూర్తిగా వైఫల్యం చెందడంతో రోజుల తరబడి వాహనాలు రోడ్డుపైనే ఉంటున్నాయి. కనీసం ఒక్కసారే వాహనాలు మార్కెట్‌కు పోటెత్తకుండా నగర శివారులోనే నిలిపివేసి దిగుమతికి అనుగుణంగా మార్కెట్‌కు తరలిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను పట్టణ శివారుకు తరలిస్తే బాగుంటుందని త్రీటౌన్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే మంత్రి తుమ్మల రూ.158 కోట్లతో మోడల్ మార్కెట్‌గా రూపాంతరం చేస్తుండటంతో ఇక మార్కెట్ తరలింపు లేనట్లే అనే నిరాశలో ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు.
7 లక్షల మొక్కజొన్న బస్తాల నిల్వ
ఖమ్మం మోడల్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న మొత్తం ఆరు షెడ్లల్లో నాలుగు షెడ్లను మొక్కజొన్న బస్తాల నిల్వ కోసం వినియోగిస్తున్నట్లు మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. ఒక్కో షెడ్లో 10వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో మక్కలను నిల్వ చేయనుండగా.. నాలుగు షెడ్లల్లో మొత్తం 7లక్షల బస్తాలను రెండునెలల వరకు నిల్వ ఉంచనున్నట్లు తెలిపారు.

Khammam
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

