ఖమ్మం రూరల్, జూన్ 30 : ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం వద్ద వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఆటోను లారీ తెల్లవారుజామున ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం గ్రామానికి చెందిన రవితేజ (34) అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.