సత్తుపల్లి, మే 6: తల్లాడ మండలం కొత్త మిట్టపల్లిలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు ఈ నెల 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మిట్టపల్లిలో మంగళవారం జరిగిన నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. కేటీఆర్ హాజరుకానున్న కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు, సండ్ర కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్, కట్టా అజయ్‌కుమార్, దుగ్గిదేవర వెంకట్‌లాల్, కనగాల వెంకట్రావు, దొడ్డా శ్రీనివాసరావు, లక్కినేని రవి, భాస్కర్‌రావు, దిరిశాల దాసు, కేతినేని చలపతిరావు, మువ్వా మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ మండలం మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నెల 9న జరిగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్యాంపు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అతిథులుగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు హాజరవుతారని కార్యాలయ బాధ్యులు పేర్కొన్నారు. అన్ని మండలాల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.