ఖమ్మం వ్యవసాయం, జనవరి 26: డీసీఎంస్ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాస్‌ను నియమిస్తూ జిల్లా సహకార శాఖ అధికారి(డీసీవో) విజయకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ చైర్మన్‌గా రాయల వెంకటశేషగిరారావు ఉన్నారు. సొసైటీ డైరెక్టర్‌గా ఆయనపై అనర్హత వేటు పడడంతో చైర్మన్ పదవిని కోల్పోయినట్టయింది. దీంతో, వైస్ చైర్మన్‌గా ఉన్న పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్‌ను చైర్మన్‌గా డీసీవో నియమించారు.