ఉత్పత్తిలో కొత్తగూడెం రీజియన్ ముందంజ
సింగరేణి సం స్థ వ్యాప్తంగా మూడు రీజియన్లలో కొత్తగూడెం రీజియన్ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. 40 శాతానికి పైగా కొత్తగూడెం రీజియన్ నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.
కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 5: సింగరేణి సం స్థ వ్యాప్తంగా మూడు రీజియన్లలో కొత్తగూడెం రీజియన్ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. 40 శాతానికి పైగా కొత్తగూడెం రీజియన్ నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. రీజియన్‌లోని ఇ ల్లెందు, కొత్తగూడెం మణుగూరు, రామగుండం రీజియన్‌లో ఆర్జీ1, ఆర్జీ2, ఆర్జీ3, ఏఎల్పీ, భూ పాలపల్లి ఏరియాలు ఉన్నాయి. బెల్లంపల్లి రీజియన్‌లో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఉ న్నాయి. సంస్థ వ్యాప్తంగా నిర్దేశించిన బొగ్గు ఉ త్పత్తి లక్ష్యాలను రోజువారీ, నెలవారీ, ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు కొత్తగూ డెం రీజియన్ ముందంజలో ఉంది.
కొత్తగూడెం రీజియన్ రోజువారీగా 1,00,987 టన్నుల బొ గ్గు ఉత్పత్తి చేస్తోంది. రామగుండం రీజియన్ రోజుకు 76,078 టన్నులు, బెల్లంపల్లి రీజియన్ 45,993 టన్నులు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మూడు రీజియన్లకు పోల్చుకుంటే జనవరి నె లలో కొత్తగూడెం రీజియన్ 30,87,990 టన్ను లు, రామగుండం రీజియన్‌లో 22,35,312 టన్నులు, బెల్లంపల్లి రీజియన్‌లో 13,16,955 టన్నులు బొగ్గు ఉత్పత్తి చేశాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు పోల్చుకుంటే కొత్తగూడెం రీజియన్ 245,95,046 టన్నులు, రామగుండం రీజియన్ 185,20,516 టన్ను లు, బెల్లంపల్లి రీజియన్‌లో 107,52,355 ట న్నులు బొగ్గు ఉత్పత్తిని సాధించాయి. మొత్తం బొగ్గు ఉత్పత్తి 538,67,017 టన్నులు ఉండగా వీటిలో 245,95,046 టన్నులు కొత్తగూడెం రీ జియన్ సాధించింది. అంటే 40 శాతం కంటే ఎ క్కువగానే సాధించినట్లు తెలుస్తోంది. రీజియన్ అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

