దేశ రాజకీయాల్లో నవ శకం ఆరంభమైంది.. రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది.. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా రూపాంతరం చెందింది. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు బీఆర్ఎస్ను ప్రకటించారు. ఇకపై జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడతామన్నారు. ఈ నిర్ణయాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, యువతీ యువకులు, వివిధ సంఘాల నాయకులు స్వాగతిస్తున్నారు. కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు.
– నమస్తే నెట్వర్క్
సంక్షేమాన్ని కాంక్షించే కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వృత్తిదారులకు ఇచ్చే ఆసరా పింఛన్లను ఏడేళ్ల క్రితమే రూ.2,016, రూ.3,016 చొప్పున పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. కానీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ఇంకా రూ.650 మాత్రమే. ఆసరా అనే మాటకు అసలైన అర్థాన్ని చూపింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఈ సామాజిక పింఛన్లు లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎంతో ఆసరానిస్తున్నాయి. కేసీఆర్ ప్రధాని అయితే అన్ని రాష్ర్టాల్లోనూ ఆసరా పథకం అమలవుతుంది.
– కనతాల సత్యనారాయణ, హమాలీ, పెనుబల్లి
ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణలోని అనేక ప్రముఖ ఆలయాల రూపురేఖలను మార్చి అత్యాధునిక ధార్మిక కేంద్రాలుగా మలిచిన మహాసంకల్పి సీఎం కేసీఆర్. యాదాద్రి ఆలయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ అద్భుతమైన ఆలయంగా నిర్మించిన మహోన్నతుడు. సర్వమతాలను గౌరవిస్తూ ముందుకుసాగుతున్న కేసీఆర్ వంటి మహానేత జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తే ధార్మికవాదులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాల పట్ల అపార అనుభవం, ధృఢ సంకల్పం కలిగిన కేసీఆర్ వంటి మహాయోధులు దేశ రాజకీయాల్లో ప్రవేశించాలి.
– వసంతాచారి, శ్రీపంచముఖ గాయత్రీ ఆలయ ధర్మకర్త, అక్కినపల్లి, మణుగూరు
మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ఆర్థికంగా మాకు ఎంతో భరోసానిచ్చింది. అందుకే ఆర్థిక ఇబ్బందులు పడకుండా ధైర్యంగా మా బిడ్డకు వివాహం జరిపించాం. వివాహ సమయంలో అయిన ఖర్చులన్నింటినీ కల్యాణలక్ష్మి చెక్కు అందాక తీర్చివేశాం. అదే కల్యాణలక్ష్మి పథకం లేకుంటే ఆర్థికంగా ఎన్నో కష్టాలను అనుభవించే వాళ్లం. దాదాపుగా అన్ని పేద కుటుంబాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అందుకని ఇలాంటి పథకం దేశమంతా అమలైతే పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాల కోసం తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కేసీఆర్ ప్రధాని అయితే దేశమంతా ఇలాంటి పథకాలు అమలు చేస్తారు.
– మోదుగుమూడి ప్రసాద్, హమాలీ, పెనుబల్లి
బీఆర్ఎస్ ఆవిర్భావం చరిత్రాత్మకం. పార్టీ దేశంలోని ఇతర రాష్ర్టాల్లోనూ అంచలంచెలుగా ఎదుగుతుంది. దేశంలో బలమైన రాజకీయ పార్టీ అవుతుంది. ప్రస్తుతం దేశప్రజలందరూ ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో విజయం సాధించి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. కేసీఆర్‌తోనే దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది.
– కందాళ ఉపేందర్‌రెడ్డి, పాలేరు, ఎమ్మెల్యే
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయింది. పేదలు మరంత దారిద్య్రంలోకి వెళ్లారు. వారి జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వంటి సమర్థుడైన నేత సేవలు దేశానికి అవసరం. ఉద్యమ నేతగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్. వారి కష్టాలు, బాధలు ఆయనకు తెలుసు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి విజయం సాధించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. యావత్ దేశ ప్రజలు ఆయనకు మద్దతు పలుకుతారు.
-ఆర్జేసీ కృష్ణ, ఆర్ఎస్ (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు, ఖమ్మం
కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వమూ ప్రజలను ఆదుకోలేదు. ఇప్పుడు యావత్ దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం హర్షణీయం. కేసీఆర్‌కు దేశమంతా మద్దతు పలుకుతుంది. ఆయన వెంటే యువత నడుస్తారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి తప్పకుండా విజయం సాధిస్తారు. హైదరాబాద్ తరహాలో దేశవ్యాప్తంగా ఐటీ రంగాన్ని విస్తరిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడతారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతారు.
-స్వరాజ్యం, యువతి, ముత్తగూడెం, ఖమ్మం రూరల్
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఎంతో చేస్తున్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కానుకగా డబ్బు అందజేస్తున్నారు. వృద్ధులకు పింఛను రూ.2,016 ఇస్తున్నారు. రైతులకు రైతుంబంధు ఇస్తున్నారు. రైతు చనిపోతే రైతుబీమా అందిస్తున్నారు. ఇంత మంచి పథకాలు మా రాష్ట్రంలో లేవు. కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి మాకూ కావాలని కోరుకుంటున్నాం. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళితే మేం మద్దతు ఇస్తాం.
– సోడి పాపారావు, రైతు, వశ్యామలడొడ్డి, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్