తల్లాడ, ఆగస్టు 27: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే రూ.2 వేలు, రూ.3 వేల పింఛన్ దేశంలో మరెక్కడా లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఇప్పటికీ రూ.600 పింఛనే అందుతోందని, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లోనూ రూ.800 మించి పింఛన్ అందడం లేదని గుర్తుచేశారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని స్పష్టం చేశారు. అడుగకుండానే 57 ఏళ్లు వయసున్న వారికి ఆసరా పింఛన్ మంజూరు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతున్నదని అన్నారు. శనివారం తల్లాడ మండలంలో పర్యటించిన ఆయన.. పినపాక, మంగాపురం, అంబేద్కర్‌నగర్, రెడ్డిగూడెం, నారాయణపురం, తల్లాడ, మల్లారం, బాలపేట, నరసింహారావు, గోపాలపేట, అన్నారుగూడెం గ్రామాలకు వెళ్లి నూతనంగా మంజూరైన పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
మండలంలో 94 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.45,59,500 విలువైన చెక్కులను, రూ.65 లక్షల విలువైన 65 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటికే 7,974 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతుండగా.. నూతనంగా మరో 2,400 మందికి పింఛన్లు మంజూరయ్యాయన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పేదలకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు రాయల వెంకటశేషగిరిరావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, హరికృష్ణారెడ్డి, దొడ్డా శ్రీనివాసరావు, సూర్యనారాయణ, గంటా శ్రీలత, రవీంద్రరెడ్డి, కొండపల్లి శ్రీదేవి, పీ.సురేశ్, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, రాధిక, దుగ్గిదేవర సామ్రా జ్యం, పొట్టేటి సంధ్యారాణి, తూము శ్రీనివాసరావు, బద్ధం నిర్మ ల, తెల్లపుట్ల స్వరాజ్యం, జొన్నలగడ్డ కిరణ్‌బాబు, వరపర్ల ఉమాఉదయ్, నల్లమోతు మోహన్‌రావు, మారెళ్ల మమత, కోసూరి వెంకటనరసింహారావు, ఓబుల సీతారామిరెడ్డి, గుం డ్ల వెంకటి, దిరిశాల దాసురావు, కేతినేని చలపతిరావు, దగ్గుల శ్రీనివాసరావు, జీవీఆర్, బొడ్డు వెంకటేశ్వరరావు, మోదుగు ఆశీర్వాదం, కంపాటి జమలయ్య, రేగళ్ల సత్యం, మూకర ప్రసాద్, శీలం శ్రీనివాసరెడ్డి, పెరిక నాగేశ్వరరావు పాల్గొన్నారు.