ఖమ్మం, జూన్ 24: ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ సీఎండీ దీవికొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా అధినేత బండి పార్థసారథిరెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారితో ప్రమాణం చేయించారు. టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్‌రెడ్డి, లోక్‌సభ ఎంపీ వెంకటేశ్ పాల్గొని పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులందరూ కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫొటోలు దిగారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో వారు సమావేశమయ్యారు.