చింతకాని, జూన్ 1: పల్లెల్లో క్రీడా ప్రాంగణాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని జగన్నాథపురం, తిమ్మినేనిపాలెం, నాగులవంచ తదితర గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న పల్లె క్రీడా ప్రాంగణాలను ఆయన పరిశీలించి కార్యదర్శులకు, ఈజీఎస్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
కల్లూరు రూరల్, జూన్ 1: మండల పరిధిలోని ఎర్రబోయినపల్లిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని గురువారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించననున్నారు. సర్పంచ్ సింగిశాల పద్మ ఆధ్వర్యంలో 30 మంది క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేయనున్నారు.
వేంసూరు, జూన్ 1: మండలంలోని మర్లపాడులో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రారంభిస్తారని సర్పంచ్ మందపాటి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రాంగణాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కావాలని కోరారు. ఆయన వెంట కార్యదర్శి సురేశ్‌రెడ్డి ఉన్నారు.
క్రీడా ప్రాంగణాల పరిశీలన
కల్లూరు రూరల్, జూన్ 1: మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని బుధవారం ఎంపీడీవో బి.రవికుమార్ పరిశీలించారు. మండలవ్యాప్తంగా ఇప్పటికే స్థలాలు ఎంపిక చేశామన్నారు. వాటిలో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్ కోర్టులు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో ప్రాంగణాలను ప్రారంభిస్తామన్నారు.