మామిళ్లగూడెం, జూన్ 1: మానవ అక్రమ రవాణా శిక్షార్హమని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో బుధవారం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పటిష్టంగా పని చేయాలన్నారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు డయల్ 100, 112, లేదా సీసీఎస్ ఏసీపీ సెల్నంబరు -94409 04881 లేదా 1098కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ రవి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భారతరాణి, చైల్డ్ లైన్ సమన్వయకర్త శ్రీనివాస్, టీం సభ్యులు భాస్కర్, నర్సింహారావు పాల్గొన్నారు.
నేడు కవి సమ్మేళనం: కలెక్టర్
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం 4:30 గంటలకు నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 70 మంది కవులు తెలంగాణపై కవితలు వినిపిస్తారన్నారు.