ఖమ్మం లీగల్, మే 31: బీఆర్ అంబేడ్కర్ స్ఫూ ర్తితో తాను పీహెచ్డీ చేశానని జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాసరావు తెలిపా రు. అంబేడ్కర్ భావజాలంతో పాటు సామాజిక పరిస్థితులు తనపై ఎక్కువ ప్రభావం చూపాయని అన్నా రు. ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయన తన నేపథ్యాన్ని ‘నమస్తే’తో పంచుకున్నారు. లోక్‌అదాలత్‌లు, రాజీ కేసులకు ప్రాధాన్యం ఇస్తానన్నారు.
నేపథ్యం ఇదీ..
1995లో లా కోర్సు పూర్తి చేసిన శ్రీనివాసరావు న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకున్నారు. న్యాయవాదిగా వైజాగ్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. అనంతరం 2005లో మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. 2014లో అదనపు జిల్లా జడ్జిగా రంగారెడ్డిలో పనిచేశారు. 2019లో ఆదిలాబార్ జిల్లా జడ్జిగా పనిచేస్తూ ఖమ్మం జిల్లా జడ్జిగా బదిలీపై వచ్చారు. ఆయన నేపథ్యం ఆయన మాటల్లోనే.. ‘జిల్లా జడ్జిగా నేను ఎన్నో కేసుల్లో తీర్పులు ఇచ్చినప్పటికీ నన్ను తీవ్ర ప్రభావితం చేసిన కేసులు హైదారాబాద్ లుంబిని, గోకుల్ చాట్‌లో పేలుళ్ల కేసులు.
ఆయా కేసుల్లో తీర్పులు చెప్పడం నా జీవితంలో ఉన్నతమైన పరిణితి. వీటితో పాటు రాష్ట్రంలోనే తొలిసారి మానవ బాంబు కేసును డీల్ చేయడం చారిత్రాత్మకం. ఖమ్మానికి రావడానికి ముందు నేను ఆదిలాబాద్‌లో గన్ ఫైరింగ్ కేసులో తీర్పునిచ్చాను. న్యాయవ్యవస్థలో రోజువారీ జరిగే వాదోపవాదాలు వింటూనే అనేక కేసుల్లో సత్వర తీర్పులు ఇస్తున్నాను. లోక్ అదాలత్‌ను అమలు చేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో అత్యధిక కేసుల పరిష్కారానికి కృషి చేస్తాను. జూన్ 4న ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేస్తాను.’ అని తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ అంశాలకు ప్రాధాన్యం..
ఉద్యోగులకు పనిలో నైపుణ్యాన్ని పెంపొందించడం, కేసుల సంఖ్య తగ్గించడం, కేసుల్లో రాజీకి అవకాశాలు చూడడం, సత్వర న్యాయం అందించడం, మౌలిక వసతుల కల్పన, అంకితభావంతో పనిచేయడం, క్రమశిక్షణ, జైలులో ఉన్న నిందితుల కేసులను త్వరగా పరిష్కరించడం, పాత కేసులు , మెయిన్టెనెన్స్ కేసులకు ప్రాధాన్యం ఇవ్వడం, లీగల్ అవేర్నెస్ క్యాంపుల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చి జడ్జి పని చేస్తారు. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయమూర్తుల సహకారంతో ముందుకు సాగుతానన్నారు. జిల్లాల విభజనతో కేసుల సంఖ్య తగ్గుతుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 52 వేల కేసులున్నాయని, జిల్లా విభజనతో అవి 16 వేలకు తగ్గిందన్నారు.