కొత్తగూడెం లీగల్, మే 31: కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా గొల్లపూడి భానుమతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె జూనియర్ సివిల్ జడ్జిగా ఇబ్రహీంపట్నం, మెదక్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, ఖమ్మం, మధిర కోర్టుల్లో పనిచేశారు. నాలుగో అదనపు జడ్జిగా సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో 2019 నుంచి పనిచేస్తూ కొత్తగూడేనికి బదిలీపై వచ్చారు. ఆమెకు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కోశాధికారి సాదిక్పాషా, లైబ్రరీ సెక్రటరీ ఆర్తీ మక్కడ్, మానిటరింగ్ కమిటీ మెంబర్ మెండు రాజమల్లు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.