ఖమ్మం, మే 30: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఖమ్మం నగరానికి చెందిన వినోద్‌కుమార్ అనే డెలివరీ బాయ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతునాడు. బాధితుడికి వైద్యం అందించేందుకు తక్షణం స్పందించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సూచించారు. వైద్య ఖర్చులకు ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా రూ.5 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. సోమవారం హైదరాబాద్‌లో చెక్కు బాధితుడికి అందజేశారు.