ఖమ్మంలో 10వేల సీసీ కెమెరాలు ఏర్పాటు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంలో జెండర్ ఈక్వాలిటీ కోసం 5కే, 2కే రన్
ప్రారంభించిన మంత్రి, పాల్గొన్న కలెక్టర్, పోలీస్ కమిషనర్
ఖమ్మం మార్చి 27 : రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. జెండర్ ఈక్వాలిటీపై అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు షీ టీమ్స్ 2కే, 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రన్ ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. మహిళలకు సురక్షిత వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా షీటీమ్‌లు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రజల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేసున్నదన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజా భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ ప్రజా సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ మాట్లాడుతూ 10వేల సీసీ కెమెరాలతో నగరాన్ని నిఘా నీడల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రన్ పూర్తి చేసిన వారికి మంత్రి చేతుల మీదుగా పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీపీ ఇంజారపు పూజ, అడిషనల్ డీసీపీ గౌస్ అలమ్, సుభాష్ చంద్రబోస్, కుమారస్వామి, ఏసీపీలు స్నేహామెహ్రా, రామోజీ రమేశ్, ఆంజనేయులు, బస్వారెడ్డి, వెంకటేశ్, ప్రసన్నకుమార్, రామానుజం, వెంకటస్వామి, విజయబాబు, సీఐ అంజలి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో హోటల్ హవేలీ వెస్ట్‌సైడ్ ప్రారంభం
హాజరైన మంత్రి పువ్వాడ, ఎంపీ, ఎమ్మెల్సీలు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన హోటల్ హవేలీ వెస్ట్సైడ్ను ఆదివారం రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. హోటల్ ప్రారంభోత్సం సందర్భంగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ పి.నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్పొరేటర్లు, పలువురు రాజకీయ నాయకులు హోటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగరంలో ఫైవ్‌స్టార్ రేంజ్లో హోటల్‌ను నిర్మించినట్లు తెలిపారు. మూడు దశాబ్దాలుగా కృష్ణా గ్రూప్ హోటళ్లను వినియోగదారులు ఆదరిస్తున్నారని, కొత్త హోటల్‌ను సైతం ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు పారుపల్లి వీరభద్రం, రాము, శరత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్ర పాల్గొన్నారు.