దమ్మపేట, నవంబర్ 18: నిరుపేద కుటుంబంలోని ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఆలోచనతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంగా మారాయని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసి మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెట్టి దేశమంతా తెలంగాణ వైపు చూసేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారికి ఉచితంగా చేప పిల్లలను అందించి కుటుంబాల్లో వెలుగులు నింపిందని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం దమ్మపేట పేరంటాల చెరువులో ఆయన చేపపిల్లలను వదిలారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 222 చెరువులకు 49,41,720 చేపపిల్లలు, దమ్మపేట మండలంలో 70 చెరువులకు 11,80,500 వివిధ రకాల చేపపిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందజేశారన్నారు. చేపపిల్లలతో పాటు ద్విచక్రవాహనాలను అందించి వారి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. అనంతరం దమ్మపేటలోని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్పస్వామికి పూజలు నిర్వహించారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ సోయం ప్రసాద్, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, సర్పంచ్, ఉపసర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, దారా యుగంధర్, ఎంపీటీసీ సోడె వెంకటలక్ష్మి, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డా రమేశ్, మాజీ ఎంపీపీ వెంకమ్మ, కోఆప్షన్ సభ్యు డు బుడే, పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, వార్డుసభ్యులు పగడాల రాంబాబు, అబ్దుల్ జిన్నా, పానుగంటి చిట్టిబాబు, పండూరి వీరబాబు, పానుగంటి లోకేశ్, తిరువీధుల జేమ్స్, ముత్తేశ్వరరావు, ముత్తే సతీశ్, బండ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.